ETV Bharat / city

Congress agitation:పెట్రో ధరల పెంపుపై.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

author img

By

Published : Jun 11, 2021, 7:47 PM IST

దేశంలో పెరిగిన పెట్రో వంటగ్యాస్​ ధరల వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ కాంగ్రెస్​ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర రాష్ట్రాలు తమ సుంకాలను తగ్గించుకోవాలని డిమాండ్​ చేశారు. క్రూడ్​ ధరలు తగ్గుతుంటే ఇంధన ధరలు మాత్రం పెరుగుతున్నాయని.. దాని వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో కన్నా వంట గ్యాస్​ ధరలు పెరిగి మోయలేవని భారంగా మారాయని ఆక్షేపించారు. మోదీ సర్కార్​ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వారు కోరారు.

congress agitations over raised petrol prices in country
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

కృష్ణా జిల్లాలో..

విజయవాడలో ఎపీసీసీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు మస్తాన్ వలి పెరిగిన పెట్రో ధరలపై ఆందోళన చేపట్టారు. మోదీ, జగన్​లు కలిసి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని.. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని స్థితిలో మోదీ ఉన్నారని మండిపడ్డారు. ఇంధన ధరలపై నాడు గొంతెత్తిన జగన్.. నేడు మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆయిల్​ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో..

కరోనా కంటే ప్రమాదకరంగా దేశ ప్రధాని మోదీ తయారయ్యారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్​ కుమార్ ​తాడికొండలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు 2014లో క్రూడ్ ఆయిల్​ బ్యారెల్​ ధర 10,709 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు లీటరు రూ. 71.41, డీజిల్​ లీటరు రూ. 55.49 ఉండేదని దానిపై సుంకాలు మెుత్తం కేవలం రూ. 12.66 గా ఉండేవన్నారు. 2020 నుంచి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పతనమై బ్యారెల్​ 3,463 డాలర్లకు చేరుకోగా.. పెట్రోల్ ధర రూ. 83.17 నుంచి రూ. 102కు, డీజల్ ధర రూ. 73.21 నుంచి రూ. 100 చేరుకుందని ఎక్సైజ్ సుంకం పెట్రోలుపై రూ. 32.99 ఉండగా డీజిల్​పై రూ. 31.83 భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వంట గ్యాస్​ విషయంలోనూ ధరలు అధికమయ్యాయన్నారు. సీఎంలను కేసుల పేరుతో బెదిరించి రాజ్యాంగపరమైన సంస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

కడప జిల్లాలో..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే పెట్రోల్ ధరలు రూ. 100కు చేరాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డిలు ఆరోపించారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద వారు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేశారు. పెట్రోల్​ పై రాష్ట్రం, క్రేంద్రాలు వేరువేరుగా శుంకాలు విధించడమే అధిక ధరలకు కారణమని ఆరోపించారు. ఇంధన ధరలు పెరుగుదల నెపంతో దేశ ప్రజల నుంచి ఇప్పటికే రూ. 14 లక్షల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. పక్కరాష్ట్రాల్లో ధరలు తగ్గిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పెంచడం దారుణమన్నారు.

చిత్తూరు జిల్లాలో..

నగిరిలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓం శక్తి గుడి నుంచి పట్టణంలోని టవర్ క్లాక్ వరకు పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కరోనా దృష్ట్యా రాష్ట్ర యూత్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు.

దేశంలో అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఏపీసీసీ ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లిలో పెరిగిన గ్యాస్, పెట్రోల్​, నిత్యావసర ధరలపై ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పరిపాలన దేశంలో ఎన్నడూ గతంలో చూడలేదని అన్నారు.

విశాఖ జిల్లాలో..

పెట్రో ధరల పెంపుపై చీడికాడ పెట్రోల్ బంకు వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. చీడికాడలో నిరసన కార్యక్రమానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లాలో..

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఆలీ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కొండారెడ్డి బురుజు వరకు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేపట్టారు. ఇంధన ధరలు తీవ్రంగా పెరగడం వల్ల అన్ని నిత్యవసరాల ధరలు పెరిగాయని ఆక్షేపించారు.

విజయనగరం జిల్లాలో..

ఇంధన, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటడంపై చీపురుపల్లిలో ​కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆది నారాయణ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలా అయితే సామాన్యులు ఎలా జీవిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్ సెంచరీ చేసిందని.. కేంద్రరాష్ట్రాలు తమ టాక్సులను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని టవర్ క్లాక్ పెట్రోల్ బంకు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టతరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ఎంపీకే టోకరా.. క్రెడిట్​ కార్డు ఫోర్జరీతో మోసం!

CJI Justice NV Ramana: శ్రీవారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చా: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.