ETV Bharat / city

తెలంగాణ: 'భాజపాకు ఆ దమ్ములేక కాంగ్రెస్​ వైపు చూస్తోంది' - హైదరాబాద్​ సమాచారం

భాజపా నేతలు నాయకత్వాన్ని తయారుచేసుకోలేక కాంగ్రెస్​ నాయకులను లాక్కుంటున్నారని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇంటిని చక్కబెట్టుకోలేక ఇతర పార్టీల వారిని తీసుకుంటే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్​లో కర్ఫ్యూ కావాలా అని కేటీఆర్ అడగడంలో అర్థం లేదన్నారు.

revanth reddy
రేవంత్ రెడ్డి
author img

By

Published : Nov 23, 2020, 6:38 PM IST

భాజపా నాయకులు ​భాగ్యలక్ష్మి గుడికి వెళ్తే, తెరాస నాయకులు నల్లపోచమ్మ గుడిని కూల్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నాయకత్వాన్ని తయారుచేసుకోలేని భాజపా తమ నాయకులను ఆకర్షిస్తోందని మండిపడ్డారు.

బయటి పార్టీల నాయకులను తీసుకుని ప్రయోజనమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహావృక్షం లాంటి కాంగ్రెస్​ను బలహీనపరిచినా ఎలాంటి నష్టం ఉండదన్నారు. పరికికంప లాంటి భాజపాను ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించారు. 20 ఏళ్లుగా కర్ఫ్యూ లేని హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్ కర్ఫ్యూ కావాలా అని అడగడంలో అర్థం లేదని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:

రాజమహేంద్రవరంలో విషాదం...నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.