విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. అలాగే ఏపీకి పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కుంటిసాకులు చెప్తూ మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా పరిశ్రమల రాకకు సహకరించాలని కోరారు. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడేవరకు సహాయం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి.. చంద్రబాబుకు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగ లేఖ