చైనా-భారత్ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సంతోశ్ బాబు సేవలకు గుర్తింపుగా.. అతని సతీమణికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు యదాద్రి భువనగిరి జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఆమె విధుల్లో చేరారు. జనవరి వరకు సంతోషిని విధులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఇదీ చదవండి: