రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ల్యాబ్లు, వాటి సామర్థ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ అమలుపై పోలీసులకు పలు సూచనలు చేశారు.
దుకాణాల వద్ద మార్కింగ్ తప్పనిసరి
రేషన్, నిత్యావసరాల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మార్కింగ్స్, ధరల పట్టిక పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని ఆదేశించిన ఆయన.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఇదీ చూడండి: