ETV Bharat / city

KCR Meet Stalin: కేంద్ర విధానాలపై కలిసి పోరాడాలని నిర్ణయం.. బలమైన కూటమి దిశగా అడుగులు..!

KCR Meet Stalin:సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసి పోరాడాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడు పర్యటనలో భాగంగా స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా వివిధ అంశాలపై చర్చించారు. భాజపాను ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమనే ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. జాతీయస్థాయిలో కార్యచరణపై సమాలోచనలు చేశారు.

KCR Meet Stalin
KCR Meet Stalin
author img

By

Published : Dec 15, 2021, 10:04 AM IST

KCR Meet Stalin:రాష్ట్రాల హక్కులు హరించేలా.. ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్న కేంద్రం ప్రభుత్వంపై పోరాడాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, స్టాలిన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాది వాణి బలంగా వినిపించటంతో పాటు భాజపా వ్యతిరేక కూటమి, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా చైన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్‌ వారిని సత్కరించారు. అనంతరం ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దక్షిణాది అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

భాజపాకు వ్యతిరేకంగా బలమైన కూటమి

KCR against BJP:భాజపా ప్రభుత్వం రాష్ట్రాలను విస్మరిస్తోందని ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్లు తెలిసింది. పన్ను వాటాల తగ్గింపు, రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్సుల విధింపు, నీతి ఆయోగ్‌ సిఫారసులను పట్టించుకోకపోవడం సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను ఇద్దరూ తప్పుబట్టినట్లు సమాచారం. కరోనా టీకాల విషయంలో వైఫల్యం, పెట్రో ఉత్పత్తులు, గ్యాస్‌ ధరల పెంపు వంటి వాటిని విమర్శించారు. కేంద్ర ఉద్యోగాలకు పోటీ పరీక్షలను హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తూ.. దక్షిణాది భాషలను విస్మరించడంతో పాటు నీట్‌పై ధోరణి, సీబీఎస్​ఈ సిలబస్‌లోరాష్ట్రాల హక్కులు హరించేలా మార్పులను స్టాలిన్‌ తప్పుబట్టగా.. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్‌ వెల్లడించారు. భాజపాను ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమనే అభిప్రాయానికి ఇద్దరు సీఎంలు వచ్చారు. దీనిపై జాతీయస్థాయిలో కార్యాచరణ గురించి మాట్లాడారని తెలుస్తోంది.

నదుల సంధానంపై చర్చ
KCR on tamilnadu govt: తమిళనాడులో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ తాము రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో శాసనసభలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందించడం లేదన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తమిళనాడులో డీఎంకే సంస్థాగత నిర్మాణం గురించి కేసీఆర్‌ తెలుసుకున్నారు. త్వరలోనే తెరాస ప్రతినిధి బృందం తమిళనాడుకు వచ్చి డీఎంకే నేతలతో భేటీ అవుతుందని తెలిపారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. ఇరురాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి చర్చించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను స్టాలిన్‌ ప్రశంసించగా తమిళనాడు పాలనలో తనదైన ముద్రను చాటుతున్నారని ఆయనకు కేసీఆర్‌ కితాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.

CM KCR meet Kamal hasan:తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అద్భుత సమావేశం జరిగిందని స్టాలిన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆయన కేటీఆర్‌తో కలిసి తమ ఇంటికి రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ఇద్దరు యోధుల సమావేశంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆయన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీదిమయం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు భేటీ కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.