ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఇవాళ మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయంపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చదవండి: