ETV Bharat / city

కరోనా, లాక్‌డౌన్ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష - lock down latest news

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి, కేసుల నమోదు, రికవరీ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సంబంధిత అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నారు.

cm kcr review on corona
cm kcr review on corona
author img

By

Published : May 24, 2021, 6:04 PM IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్​ రావు, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, ఆర్థిక, వైద్య-ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి, కేసుల నమోదు, రికవరీ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.

లాక్​డౌన్ అమలు తీరుతెన్నులు, ఇబ్బందులపై కూడా సమావేశంలో సమీక్షించనున్నారు. నగరాల్లో లాక్​డౌన్ అంతగా అమలు కావడం లేదని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో శనివారం నుంచి పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. అటు వ్యాక్సినేషన్​పై కూడా చర్చించనున్నారు. రెండో డోసు వారికి టీకాలు వేయడంతో పాటు... ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు, కండక్టర్లు, సేల్స్ మేన్స్ లాంటి వారిని సూపర్ స్పైడర్లుగా గుర్తించి వారికి ప్రాధాన్యక్రమంలో టీకాలు ఇచ్చే విషయమై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 12,994 కరోనా కేసులు, 96 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.