గూడ అంజయ్య ఆశయాలను నిజం చేసి చూపిస్తున్నామని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నామని తెలిపారు. గూడ అంజయ్య వర్థంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
జీవన తాత్వికత, సాంస్కృతిక చైతన్యానికి అంజయ్య పాట చిరునామా అని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే అంజయ్య ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్లు ఉంటే.. ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారు: సీఎం