గోదావరి - కృష్ణా నదుల అనుసంధానికి కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు... నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర కరవు ఎదుర్కొంటున్నాయని... గత ఏడేళ్లుగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని లేఖలో తెలిపారు. 80 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. గోదావరి నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించి కరవును తీర్చాలని కోరారు. ఇందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని లేఖలో తెలిపారు. ఈ విషయంపై ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకున్నామని లేఖలో చెప్పారు. సాగు,తాగు, పారిశ్రామిక అవసరాలకు తీర్చే ఈ చర్యకు.. సహాయం చేయాలని లేఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రాసిన లేఖను కేంద్రమంత్రికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అందించారు.
కృష్ణా-గోదావరి అనుసంధానానికి సాయపడండి! - vijaysai reddy
గోదావరి - కృష్ణా నదులను అనుసంధానించాల్సిందిగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంత వాసులు తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్నారని అందులో పేర్కొన్నారు.