ETV Bharat / city

ఉచిత పంటల బీమా పథకంలోకి.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అమలు చేయనున్నాయి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కలిపి అమలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

CM Jagan
CM Jagan
author img

By

Published : Jul 12, 2022, 8:11 PM IST

Prime Minister Fasal Bima Yojana: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

యూనివర్సల్‌ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ: రాష్ట్రంలో పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్ ‌బీమా యోజన తీసుకురానున్నారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫసల్‌ బీమా యోజనలో మార్గదర్శకాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మార్పులు చేసింది. ఇటీవల కేంద్ర బృందం రాష్ట్ర పర్యటించగా.. సీఎం సూచనలతో ఫసల్‌ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. ప్రకటించిన పంటల్లో రైతులందరికీ ఫసల్‌ బీమా వర్తించేలా మార్పులు చేశారు. ఇ–క్రాప్‌ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించే విధానం తీసుకువస్తున్నారు. వ్యవసాయ పద్ధతులు ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను కేంద్ర వ్యవసాయశాఖ తీసుకొచ్చింది. యూనివర్సల్‌ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫసల్‌ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధానపరంగా మార్పు రావాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

రైతుల భీమాను సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది: రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్‌ చేస్తూ, రియల్‌ టైం డేటా చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతు సాగుచేస్తున్న ప్రతి పంటకూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటి భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయన్నారు.

ఫసల్‌ బీమా కింద రాష్ట్ర వాటాతో పాటు.. రైతుల ప్రీమియం భారం కూడా ప్రభుత్వంపైనే పడుతోంది. వ్యవసాయం చేసే వారందరినీ ఫసల్ బీమా పరిధిలోకి తెస్తే.. ఈ భారం ఉండదు. రైతుల ప్రీమియాన్ని కేంద్రం, రాష్ట్రాలు సమానంగా భరిస్తే అద్భుతంగా ఉంటుంది. దీనిపై మీ విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకోవాలి. -జగన్‌, ముఖ్యమంత్రి

సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే ఆ దిశలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాాలు ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాయన్నారు.

ఫసల్‌ బీమా యోజనలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం అయ్యాయి. నేచురల్‌ ఫార్మింగ్, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌లో ఏపీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఫసల్‌ బీమా యోజన రైతులకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం కలిగితే ఈ పథకం అండగా నిలుస్తుంది. -- నరేంద్ర సింగ్ తోమర్ , కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.