రైతుభరోసా పథకంలో కొంతమంది రైతులకు ఆర్థిక సాయం అందకపోవటంపై... ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి... రైతు భరోసా కింద ఇంకా 2 లక్షల 50 వేల మంది రైతులకు ఎందుకు చెల్లింపులు చేయలేదని ప్రశ్నించారు. తక్షణం బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
డిసెంబరు 21 నుంచి ప్రారంభం కానున్న... నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు కేటాయించామని... పథకం అమలుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బార్లు, మద్యం దుకాణాల విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : డిసెంబరు 1 నుంచి సీమ జిల్లాలో పవన్ పర్యటన