ETV Bharat / city

స్పందనలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: సీఎం

author img

By

Published : Feb 25, 2020, 5:29 PM IST

స్పందన కార్యక్రమం, పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి భూమి తీసుకోవాలని సూచించారు.

CM Jagan Review on Spandana
సీఎం జగన్‌ సమీక్ష
స్పందనపై సీఎం జగన్‌ సమీక్ష

భూసేకరణలో సమస్య పరిష్కరానికి జిల్లాలకు సీఎస్​, ముఖ్యమంత్రి కార్యదర్శులను నియమించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు సీఎస్‌ నీలం సాహ్ని, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్​ను నియమించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రాయలసీమ జిల్లాలకు సీఎం కార్యదర్శి ఆరోఖ్య రాజ్‌, ఉత్తరాంధ్ర జిల్లాలకు సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు అప్పగించారు.

కలెక్టర్లకు ఏ సాయం కావాల్సినా సంబంధిత అధికారులను సంప్రదించాలని స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి ఇళ్లస్థలాల భూమిని పొజిషన్‌లోకి తీసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి వాలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్‌ మ్యాపింగ్‌ చేయాలన్న ముఖ్యమంత్రి... మార్చి 1 నాటికి అన్ని దిశ పోలీస్‌స్టేషన్లు సిద్ధం కావాలని చెప్పారు.

స్పందనలో జిల్లాల్లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్ కోతల ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఆయా జిల్లాల్లో తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

ఇదీ చదవండి:

అవినీతి నిరోధక టోల్‌ఫ్రీ నెంబరుపై ప్రచార చిత్రం విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.