ETV Bharat / city

ప్రతిష్ఠాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం:సీఎం

'స్పందన' కార్యక్రమంపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ, అమ్మఒడి, రైతు భరోసా, చేనేతలకు ఆర్థిక సాయం, అగ్రిగోల్డ్ తో వంటి అనేక అంశాలపై అధికారులతో చర్చించారు.

'స్పందన' పై సీఎం జగన్ సమీక్ష
author img

By

Published : Aug 27, 2019, 12:27 PM IST

Updated : Aug 27, 2019, 3:28 PM IST

సచివాలయంలో 'స్పందన' కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలు, పరిష్కారంపై సమీక్షించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని సీఎం అన్నారు. కలెక్టర్ పరిశీలించాక ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ఉంచిన వినతులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పెండింగ్ వినతుల తగ్గాలంటే కచ్చితంగా జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం..

ఇల్లులేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలన్నది చాలా ప్రతిష్ఠాత్మకం సీఎం అన్నారు. ఈ కార్యక్రమాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు సూచించారు. ఇందులో గ్రామ వాలంటీర్ల పాత్ర చురుకుగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వాలంటీర్లదంరికీ త్వరగా స్మార్ట్ ఫోన్లు అందించాలని సీఎం అన్నారు.

అక్టోబరు 15న రైతు భరోసా

అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. నవంబరు 21 న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా... పడవలు, బోట్లు ఉన్న వారికి రూ. 10 వేలు చొప్పున ఇస్తామని అన్నారు. డీజిల్ కోనుగోలు విషయంలో వాళ్లకు సబ్సిడీ అందేలా చూస్తామని పేర్కొన్నారు.

చేనేత కార్మికులకు చేయూత
డిసెంబర్‌ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీకనుగుణంగా మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

జనవరి 26న అమ్మఒడి

జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నామని సీఎం తెలిపారు. సీఎం జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు, అగ్రిగోల్డ్, కౌలు రైతుల సమస్యలు, క్రీడలు వంటి అనేక అంశాలపై అధికారులతో చర్చించారు.

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో 314 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికంగా మహిళా ఓటర్లు వినియోగించుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో ఇబ్బంది తీవ్రంగా అవస్థలు పడ్డారు ఒంటి గంటకి 46 శాతం పోలింగ్ అయింది . పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Body:ఎన్నికల పోలింగ్

Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో 314 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికంగా మహిళా ఓటర్లు వినియోగించుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో ఇబ్బంది తీవ్రంగా అవస్థలు పడ్డారు ఒంటి గంటకి 46 శాతం పోలింగ్ అయింది . పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Last Updated : Aug 27, 2019, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.