ETV Bharat / city

'ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించండి' - ఏపీ పరిశ్రమల శాఖ తాజా వార్తలు

పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా విధానానికి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

CM Jagan Review On Industries in Tadepally camp Office
ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
author img

By

Published : Aug 4, 2020, 6:32 PM IST

పరిశ్రమల కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామనే అంశాన్ని కంపెనీలు బోర్డులపై పెట్టాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

పరిశ్రమల్లో థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా ఉండాలని ఆదేశించిన సీఎం... ఇండస్ట్రియల్‌ పార్కుల్లోనూ నిబంధనలు అమలవుతున్నాయా..? లేదా..? చూడాలని సూచించారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని స్పష్టం చేశారు. విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో ఇన్‌హెబిటర్స్‌ ఉంటే ప్రమాదం జరిగేది కాదన్న సీఎం జగన్... ఎవరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్న సీఎం జగన్... పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా విధానానికి సీఎం ఆదేశించారు.

కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలి: అధికారులు

కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులన్నింటినీ సూచిస్తూ ఇండస్ట్రియల్‌ అట్లాస్‌ అట్లాస్‌ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న దానిపై అట్లాస్‌లో వివరాలు ఉండనున్నాయి.

ఇదీ చదవండీ... పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.