ETV Bharat / city

విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ: సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్ తాజా వార్తలు

2020-2023 పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

cm jagan review on industrial policy
పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
author img

By

Published : Jul 2, 2020, 3:27 PM IST

2020-2023 పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని... విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

ఐటీ రంగంలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ గొప్ప మలుపు కాగలదని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. వర్సిటీలో కోర్సులు, బోధన అంశాలపై నిపుణుల సలహాలు తీసుకుని... హైఎండ్‌ వర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే వర్సిటీల్లో ఎక్స్‌టెన్షన్‌ మోడల్స్‌పైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: 'జగన్ కేబినెట్​ మంత్రులంతా డమ్మీలు '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.