ETV Bharat / city

సీఎం వద్దకు ముండ్లమూరు ఎంపీపీ వివాదం.. ఎమ్మెల్యే వేణు వర్గానికే పదవి - ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు

dispute of darsi mpp
dispute of darsi mpp
author img

By

Published : Sep 22, 2021, 3:01 PM IST

Updated : Sep 22, 2021, 3:37 PM IST

14:56 September 22

dispute of mundlamoor mpp

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు ఎంపీపీ (cm jagan resolved mundlamoor mpp issue news) వివాదం కొలిక్కివచ్చింది.  తాడేపల్లికి చేరిన ఈ వ్యవహారాన్ని.. ముఖ్యమంత్రి జగన్  పరిష్కరించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు వర్గానికే పదవి ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో కూడా దర్శి అసెంబ్లీ సీటు మద్దిశెట్టికే ఇస్తామని స్పష్టం చేశారు. 

వేణుతో కలిసి పని చేయాలని బూచేపల్లి శివప్రసాద్​కు..సీఎం జగన్​ సూచించారు. ఇద్దరు కలిసుంటే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందన్నారు. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఈ క్రమంలో ముండ్లమూరు ఎంపీపీ ఎన్నికపై ఇరువర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో మంగళవారం సీఎం క్యాంప్‌ ఆఫీసు వద్ద మద్దిశెట్టి వర్గం బలప్రదర్శనకు దిగారు.

ఇదీ చదవండి

15మందిని చంపిన పులి కోసం వేట షురూ!

Last Updated : Sep 22, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.