ETV Bharat / city

'రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి'

కొవిడ్ క‌ష్ట‌కాలంలో ఆర్థిక వ‌న‌రులు అనుకున్న స్థాయిలో లేక‌పోయిన‌ప్ప‌టీకి రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌ని వైఎస్ఆర్ రైతు భ‌రోసా మొద‌టి విడ‌త‌ నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్లు సీఎం జ‌గ‌న్ అన్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో బ‌ట‌న్ నొక్కి ఆయ‌న ఈ నిధులు విడుద‌ల చేశారు.

cm jagan releases raithu bharosa funds
cm jagan releases raithu bharosa funds
author img

By

Published : May 13, 2021, 11:49 AM IST

Updated : May 14, 2021, 4:23 AM IST

కొవిడ్‌ కష్టకాలంలో ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా ప్రభుత్వం కంటే రైతుల కష్టాలే ఎక్కువని భావించి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌’ పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత చెల్లింపుల కింద 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7,500 చొప్పున రూ.3,928.88 కోట్లు జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం గురువారం బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ 23 నెలల పాలనలో దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎక్కడా వివక్ష, లంచాలకు తావులేకుండా సామాజిక తనిఖీలు చేసి ఏ ఒక్క అర్హుడూ నష్టపోకుండా పారదర్శకంగా అందరికీ ప్రయోజనం కల్పించామని చెప్పారు.

వైఎస్ఆర్ రైతు భ‌రోసా మొద‌టి విడ‌త‌ నిధుల‌ను విడుద‌ల చేసిన సీఎం జగన్

‘రైతు భరోసా కింద 2019-20 నుంచి ఇప్పటి వరకు రూ.17,029 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా గర్వంగా చెబుతున్నా. 23 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద అందించిన సాయం రూ.68 వేల కోట్లకు పైగా ఉంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద గత ప్రభుత్వం చెల్లించకుండా వెళ్లిన బకాయిలతో కలిపితే 67.50 లక్షల మంది రైతులకు రూ.1,261 కోట్లు ఇచ్చాం. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్లు చెల్లించాం. ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద మరో రూ.1,038 కోట్లు ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా తెలియజేస్తున్నా. ఇతర పంటలు కూడా రూ.4,761 కోట్లతో కొని రైతులకు అండగా నిలబడ్డాం’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘ఉచిత వ్యవసాయ విద్యుత్తు రాయితీ కింద రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం ఫీడర్లపై ఇంకో రూ.1,700 కోట్లు వెచ్చించాం. గత ప్రభుత్వం చెల్లించకుండా వెళ్లిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు తీర్చాం. విత్తన సేకరణ బకాయిలురూ.384 కోట్లు చెల్లించాం. శనగ రైతులకు బోనస్‌ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం రూ.1,224 కోట్లు వెచ్చించాం. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇచ్చేందుకు రెండేళ్లలో రూ.1,560 కోట్లు ఖర్చు చేశాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని ముఖ్యమంత్రి అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా..
‘దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాల (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌)తో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయ భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం వర్తింపజేస్తున్నాం. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు చూసి చెప్పిన దానికన్నా ఏడాది ముందుగా ఇస్తామన్నదాని కంటే మరో రూ.వెయ్యి ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున అందజేస్తున్నాం. ఖరీఫ్‌లో ఏ రైతూ పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదని ఈ రోజు మొదటి విడత సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి, మరో 70 శాతం రైతులు హెక్టారు (2.5 ఎకరాల)లోపు భూమి కలిగి ఉన్నారు. రైతుభరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుందని సగర్వంగా తెలియజేస్తున్నా. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద ఈ నెల 25న దాదాపు 38 లక్షల మంది రైతులకు సుమారు రూ.2 వేల కోట్లు అందిస్తాం’ అని సీఎం ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను ఆదుకొని ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్‌తో సహజీవనం తప్పదు కొవిడ్‌తో యుద్ధం చేస్తూ దాంతో సహజీవనం తప్పదు. మాస్క్‌లు ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరం పాటించడం జీవితంలో భాగం కావాలి. కొవిడ్‌ నుంచి సమూలంగా బయటపడాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. - సీఎం జగన్‌

ఇదీ చదవండి: కుటుంబాల్లో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురేసి మృత్యువాత

Last Updated : May 14, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.