ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి పంట నష్టపోయిన 9.48 లక్షల రైతులకు 1252 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు జిల్లాల నుంచి కలెక్టర్లు, లబ్దిపొందిన రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
-
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘డా.వైయస్సార్ ఉచిత పంటల బీమా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. 9.48 లక్షల మంది లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.1,252 కోట్ల పంట బీమా పరిహారం జమ. pic.twitter.com/kOdI5uvAoB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘డా.వైయస్సార్ ఉచిత పంటల బీమా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. 9.48 లక్షల మంది లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.1,252 కోట్ల పంట బీమా పరిహారం జమ. pic.twitter.com/kOdI5uvAoB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 15, 2020తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘డా.వైయస్సార్ ఉచిత పంటల బీమా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. 9.48 లక్షల మంది లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.1,252 కోట్ల పంట బీమా పరిహారం జమ. pic.twitter.com/kOdI5uvAoB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 15, 2020
సీజన్ ముగియగానే...
పంటల బీమా చెల్లింపు రైతులకు భారంగా మారిన పరిస్థితి గతంలో ఉండేదన్న సీఎం.... రైతుల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పంటల బీమా భారం తగ్గించి ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో రైతులు కట్టాల్సిన రూ.468 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.503 కోట్లు ప్రీమియం మొత్తం కలసి రూ.971 కోట్లు ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. గతంలో సగటున 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలో ఉంటే.. ఇప్పుడు 45.96లక్షల హెక్టార్లు బీమా కిందకు వచ్చాయన్నారు. రైతులకు సకాలంలో బీమా మొత్తం అందిస్తామన్న సీఎం....ఇకపై సీజన్ ముగియగానే పంటల బీమా మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ నమోదు చేసి పంట నష్టం అంచనాలను పారదర్శకంగా నమోదు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే .. అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తున్నామన్నారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు.
డ్రిప్ పరికరాలను 10 ఎకరాల పరిమితితో వ్యక్తిగతంగా అందించాలని సీఎంను ఓ రైతు కోరగా...సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. డ్రిప్ పరికరాల పంపిణీపై రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపిన సీఎం.. ఎలా అమలు చేయాలనే విషయమై వచ్చే నెలలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఇదీ చదవండి