cm Jagan on carbon free economy: ప్రస్తుతం కాలుష్య రహిత ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచం మొత్తం దృష్టి పెట్టాలని దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీ ఇప్పటికే ఈ దిశగా ముందడుగులు వేస్తోందని చెప్పారు. పర్యావరణ, సామాజిక, ప్రభుత్వ పాలన పరంగా లక్ష్యాలు సాధించాలని జగన్ సూచించారు. రాష్ట్రంలో 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీలో అవకాశం ఉందని... పెట్టుబడిదారులు ముందుకురావాలని ఆహ్వానిస్తున్నట్లు జగన్ చెప్పారు. దావోస్ సదస్సులో భాగంగా కర్బనరహిత ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన ప్రత్యేక సెషన్‌కు జగన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రత్యేక సెషన్‌కు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆర్సెలార్ మిట్టల్ సంస్థ సీఈవో, దస్సాల్ట్ సిస్టమ్స్, కేపీఎంజీ ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.
ప్రపంచంలో తొలిసారి పంప్డ్ స్టోరేజీ, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టు మొదలయ్యాయి. ఒకేచోట 1,650 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాం. అనుబంధంగా 3 వేల మెగావాట్ల సౌరవిద్యుత్, 900 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా 5,230 మెగావాట్ల పర్యావరణ అనుకూల ఇంధన ప్రాజెక్టు ఇది. ఒక టీఎంసీ ఎత్తిపోతల ద్వారా 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధానం సుస్థిరమైంది.. ఆర్థికంగా అతి చౌకైన ప్రాజెక్టు. మరో 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీలో అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు ఏపీ అనుకూలంగా ఉంది. పర్యావరణ అనుకూల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం. -జగన్, ముఖ్యమంత్రి
NITI Aayog CEO Amitabh Kant: హరిత ఇంధనంతో ఉత్పత్తి ప్రపంచానికి సవాల్ కాబోతోందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. పంప్డ్ స్టోరేజీ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిందని అమితాబ్ కాంత్ తెలిపారు. 'భారత్‌లో కర్బన ఉద్గారాలకు సంబంధించి తలసరి వినియోగం చాలా తక్కువ ఉంది. కర్బన ఉద్గారాలు తగ్గించేలా భారత్ లక్ష్యాలను విధించుకుంది. కాప్-21 అంశాలను భారత్ మినహా మరే దేశమూ అమలు చేయట్లేదు. సంప్రదాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. కిలోవాట్ విద్యుత్‌కు గంటకు రూ.1.99 ఖర్చు అవుతోంది.. ఇంకా తక్కువకు తయారు చేసేలా సాంకేతికత సిద్ధం చేస్తున్నాం. నౌకాయానం, ఎరువులు, స్టీల్ అన్నీ హరిత ఇంధనం ద్వారా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది' అని అమితాబ్ కాంత్ అన్నారు.
ఇదీ చదంవడి: