ముఖ్యమంత్రి జగన్ ఈనెల 5న దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు దిల్లీ బయల్దేరనున్న సీఎం ప్రధాని మోదీతో మధ్యాహ్నాం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో అక్టోబరు 15 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి