తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కృష్ణదాస్, సీఎస్ సాహ్ని, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 2020–21లో రూ.2,51,600 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని.. వ్యవసాయ రుణాలు గతేడాది కంటే 11.9 శాతం పెంచాలని నిర్ణయించారు. 2019-20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యం చేరుకున్నామని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని రబీ నాటికి చెల్లిస్తామన్న అధికారులు...రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్లకు సాయం చేయాలని అధికారులు వివరించారు.
అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. ఈ సహాయంతో వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధిదారు మహిళలకు ఇస్తామని సీఎం తెలిపారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. భవిష్యత్‌లో మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఈ కంపెనీలు, బ్యాంకులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. సెప్టెంబర్‌లో స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మొత్త మ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుంది. ఈ కంపెనీలు, బ్యాంకర్లు ఒక తాటిమీదకు వచ్చి.. మహిళలకు ఆదాయాలను తెచ్చే కార్యక్రమాలను చేపట్టాలి. గ్రామాల్లో మెరుగైన ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోడపడతాయి.
-సీఎం జగన్
ఇదీ చదవండి