రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కాపు సామాజికవర్గంలోని మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు 'వైఎస్ఆర్ కాపు నేస్తం' పథకాన్ని సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఐదేళ్లలో మొత్తం రూ. 75వేల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి ఏడాది రూ. 354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.
'అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పాలన సాగిస్తున్నాం. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేస్తాం. తొలి ఏడాది రూ.354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36 లక్షల మంది మహిళలకు లబ్ధి చూకురుతుంది. జాబితాలో ఎవరి పేరు లేకపోయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అందరికీ న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఏడాదికి సగటున రూ.400 కోట్లు ఇవ్వని పరిస్థితులు గత ఐదేళ్లలో ఉన్నాయి. ఈ 13 నెలల కాలంలోనే రూ.4,700 కోట్లు నిధులు ఇచ్చాం'- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి: వాహనాల విడుదల కేసు: హైకోర్టు విచారణకు హాజరైన డీజీపీ