ETV Bharat / city

Tributes to Jagjivan Ram: బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి.. ప్రముఖుల నివాళులు - బాబు జగ్జీవన్‌ రామ్‌ కు చంద్రబాబు నివాళులు

CM Jagan Tributes to Babu Jagjivan Ram: నేడు డా. బాబు జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

CM Jagan,Chandrababu, Lokesh Tributes to Babu Jagjivan Ram

author img

By

Published : Apr 5, 2022, 12:18 PM IST

Updated : Apr 5, 2022, 12:31 PM IST

CM Jagan,Chandrababu, Lokesh Tributes to Babu Jagjivan Ram: నేడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్​ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

CM Jagan Tributes to Babu Jagjivan Ram
బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి..

జనం కోసమే జగ్జీవన్‌.. తన జీవితాన్ని అంకితం చేశారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ట్విట్టర్​లో కొనియాడారు.

బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి..
బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి..

దళిత ప్రజల భవిష్యత్​కు భరోసా, వారికి సరైన గౌరవం ఇవ్వడమే బాబు జగ్జీవన్ రామ్​కి మనమందించే అసలైన నివాళి అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు. సామాజిక న్యాయంపై జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని చంద్రబాబు గుర్తు చేసుకుంటూ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి..
బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి..

దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే... సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని లోకేశ్ కొనియాడారు. దళితుల హక్కుల అమలులో కీలక పాత్ర పోషించడంతో పాటు.. వారిని విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని జీవితాంతం పరితపించారన్నారు. నిర్వహించిన ప్రతి పదవితో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మార్గదర్శి అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి : New Districts in AP : వికేంద్రీకరణ రాజధానికేనా.. జిల్లాలకు వర్తించదా?

Last Updated : Apr 5, 2022, 12:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.