హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో రహస్య కెమెరా ఉంచిన వైనం బయటపడింది. అందులో పనిచేసే క్లీనింగ్ బాయ్ ఈ పని చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఏడాది క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఈ రోజు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. వస్త్ర దుకాణంలో పనిచేసే మహిళ చరవాణికి తన అర్ధనగ్న దృశ్యాలు వచ్చాయి. అందులో పనిచేసే క్లీనింగ్ బాయ్ మొబైల్ నుంచి ఈ దృశ్యాలు వచ్చినట్లు మహిళ గుర్తించింది. దృశ్యాలు పంపించడమే కాకుండా ఆమెను వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... క్లీనింగ్ బాయ్ బంగాల్‌కు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. క్లీనింగ్ బాయ్ కేవలం వస్త్ర దుకాణంలో పనిచేసే తోటి మహిళల చిత్రాలే సేకరించాడా లేకపోతే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కెమెరాలేమైనా పెట్టాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చరవాణి ద్వారా చిత్రాలు సేకరించాడా లేకపోతే రహస్య సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి చరవాణి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: