ETV Bharat / city

"లోకేశ్, అచ్చెన్నాయుడి పేర్లు చెప్పాలని.. సీఐడీ అధికారులు ఒత్తిడి తెచ్చారు" - రెండోరోజు ఐటీడీపీ కోఆర్డినేటర్​ను విచారించిన సీఐడీ

ITDP coordinator Venkatesh: ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేశారనే అభియోగాలపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ "ఐ టీడీపీ" కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌ను రెండో రోజూ సీఐడీ విచారించింది. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు పదే పదే చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెనాయుడు పేర్లు చెప్పాలని బెదిరించారని వెంకటేశ్‌ తెలిపారు. తన లాయర్‌ను సీఐడీ కార్యాలయంలోకి అనుమతించని అధికారులు.. సాక్షి మీడియా ప్రతినిధిని మాత్రం విచారణ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉంచారన్నారు.

ITDP coordinator
ఐటీడీపీ కో ఆర్డినేటర్‌ వెంకటేశ్‌
author img

By

Published : Jun 4, 2022, 7:29 AM IST

ITDP coordinator Venkatesh: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల ప్రోద్బలంతోనే సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినట్లు చెప్పాలంటూ సీఐడీ అధికారులు తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ సమన్వయకర్త అప్పిని వెంకటేశ్‌ తెలిపారు. వారిద్దరి పేర్లు చెబితే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామంటూ ప్రలోభ పెట్టారని వివరించారు. తనను విచారిస్తున్న సమయంలో సీఐడీ అధికారులకు పలుమార్లు ఫోన్లు వచ్చాయని, ఆ కాల్స్‌ మాట్లాడిన తర్వాత ప్రతిసారి... వారు తన వద్దకు వచ్చి లోకేష్‌ పేరు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో ఒకరు వెనుక నుంచి నడిపిస్తున్నారనేది తనకు అర్ధమైందన్నారు.

అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని పేర్కొంటూ ఉన్న పోస్టును సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారన్న ఆరోపణపై అప్పిని వెంకటేశ్‌పై సీఐడీ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. గురు, శుక్రవారాల్లో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, న్యాయవాది మాగులూరి హరిబాబులతో కలిసి మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరులో విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారి ఒకరు... 'లోకేష్‌కు ఫోన్‌ చేసి ఇక్కడికి రమ్మని పిలువు' అంటూ ఒత్తిడి చేశారు. ఆ సమయంలో సాక్షి మీడియా ప్రతినిధులు కూడా సీఐడీ కార్యాలయంలో ఉన్నారు. అసలు వారిని ఎవరు? ఎందుకు అనుమతిచ్చారో తెలియదు. ఆ రోజు రాత్రి 8.30 గంటల వరకూ నన్ను అక్కడే ఉంచారు. అనంతరం శుక్రవారం విచారణకు హాజరుకావాలన్నారు. సీఐడీ కార్యాలయం లోపలికి ఎవర్నీ వెళ్లనీయలేదు. ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని చెబుతూ పంపించేశారు’’ అని వెంకటేశ్‌ అన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.