సీఎం సహాయనిధి నకిలీ చెక్కుల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. 16 వేల చెక్కులు బాధితులకు పంపిణీ చేసినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపిన రెవెన్యూ శాఖ... 16 వేల చెక్కుల్లో 976 మాత్రమే లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసినట్లు వెల్లడించింది. మిగిలిన అన్ని చెక్కులూ లక్ష లోపు మొత్తాలని స్పష్టం చేసింది.
సీఎంఆర్ఎఫ్ విభాగం నకిలీ చెక్కులపై పేర్కొన్న నంబర్ల వివరాలను సీఐడీ సరిపోల్చి చూస్తోంది. గతంలో ఇవే నంబర్ చెక్కులు ఎవరికీ జారీ చేశారన్న అంశంపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఒకటి మైలవరం, మరొకటి ప్రొద్దుటూరులో ఉన్న బాధితులకు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 2019లో జారీచేసిన మరో చెక్కును ఖాతాలో జమ చేయలేదని సమాచారం. ప్రభుత్వ ఖాతాలో మొత్తంగా రూ.90 కోట్లు మాత్రమే నిధులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తి విగ్రహాల కేసును ఛేదించిన పోలీసులు...ముగ్గురు అరెస్ట్