ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలపై సీఐడీ అధికారులు మాజీమంత్రి దేవినేని ఉమకు మరోసారి నోటీసులిచ్చారు. మే1 వ తేదీ ఉదయం 11గంటలకు మరోమారు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయంలో 9 గంటల పాటు దేవినేని ఉమని అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ఉమకు అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.
ప్రెస్ మీట్లో ఉమ ఉపయోగించిన సెల్ ఫోన్, ట్యాబ్లు ఎక్కడ అని అధికారులు అడిగారు. ఉమ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని సీఐడీ అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసేందుకు దేవినేని ఉమ సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: మానవత్వం చాటిన కానిస్టేబుల్