ETV Bharat / city

కరోనా కంటే కక్షసాధింపే ముఖ్యమా..?: చినరాజప్ప - వైసీపీపై చినరాజప్ప కామెంట్స్

వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. వాట్సప్​లో మేసెజ్​లు ఫార్వర్డ్ చేసినందుకు అరెస్టు చేయటం హేయమైన చర్యని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్​పై కామెంట్లు పెట్టినవారిపై చర్యలు తీసుకోలేదే అని నిలదీశారు. ప్రభుత్వం కరోనా కట్టడిపై శ్రద్ధపెట్టకుండా... కక్షసాధింపు రాజకీయాలు చేస్తుందని మండిపట్టారు.

చినరాజప్ప
చినరాజప్ప
author img

By

Published : Jun 26, 2020, 12:42 PM IST

వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో వట్టికూట నరసింహారావు అనే వ్యక్తిని గురువారం రామచంద్రాపురంలో అరెస్టు చేశారని ఆయన అన్నారు. 66 సంత్సరాల వయసున్న అతన్ని, ఆరోగ్యం బాగోలేకపోయినా గుంటూరు తీసుకెళ్లి వేధిస్తున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా వంతడలో పూతల శేషగిరిరావు అనే గనుల వ్యాపారి వైకాపా వేధింపుల కారణంగా చనిపోయారని చినరాజప్ప చెప్పారు.

అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. శిద్ధా రాఘవరావును లొంగదీసుకున్న మాదిరే... గొట్టిపాటి రవిని కూడా లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. దాతలు ఇచ్చిన నిధులను మాత్రమే కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కరోనా నివారణపై దృష్టిపెట్టకుండా.. ప్రతిపక్షాలను హింసించడంపై శ్రద్ధపెట్టారని మండిపడ్డారు. కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని చినరాజప్ప ఆరోపించారు.

ఇదీ చదవండి : దిల్లీకి రఘురామకృష్ణరాజు..స్పీకర్, హోంశాఖ అధికారులను కలిసే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.