ETV Bharat / city

సీనియర్ రెసిడెంట్ వైద్యుల ఉపకార వేతనం పెంపు.. ఎంత పెంచారంటే..!

సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల ఉపకార వేతనాన్ని రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వైద్య విద్యార్థులు ఉపకార వేతనం పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని బుధవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఉపకార వేతనం పెంపు
ఉపకార వేతనం పెంపు
author img

By

Published : Jun 3, 2021, 7:08 AM IST

సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల ఉపకార వేతనాన్ని రూ.45 వేల నుంచి రూ.70వేలకు పెంచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వైద్య విద్యార్థులు ఉపకార వేతనం పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని బుధవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సింఘాల్‌ మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపకార వేతనం నుంచి ఆదాయపన్ను వసూలు చేయకుండా ఉండడం, పీజీ విద్యార్థులకు పరీక్షల నిర్వహణ గురించి ముందుగా తెలియజేయడం, ఇతర సమస్యలనూ వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని ఏపీ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. వారంలోగా హామీలు అమలుచేయకుంటే తిరిగి ఆందోళన కొనసాగించేందుకు వెనుకాడబోమని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

15లోగా 8.76 లక్షల డోసుల రాక

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్య సేవలపై సింఘాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గినందున 24 గంటల్లో 443 టన్నుల ఆక్సిజన్‌ సరిపోతోంది. మంగళవారం సాయంత్రం నాటికి 1.82 కోట్ల మందికి కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చాం. జూన్‌ 30లోగా కొవాగ్జిన్‌ రెండోడోసును ఇవ్వాలి. కేంద్రం నుంచి ఈ నెల 15లోగా 8.76 లక్షల డోసులు వస్తాయి. 45 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలకు వెళ్తుంటే.. వారికి టీకాలు వేయాలని సీఎం ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు పంపాం. వారి టీకా ధ్రువపత్రంలో పాసుపోర్టు నంబరు నమోదుకు వీలు కల్పించాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

Vaccination: 'టీకాల పంపిణీలో జాతీయ సగటును అధిగమించాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.