అశ్లీల వెబ్సైట్ ద్వారా విటులకు గాలం వేస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్న కేటుగాళ్లను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల కాలంలో ఆన్లైన్ ద్వారా రూ. 60 లక్షలు టోపీ పెట్టినట్లు విచారణలో తేలింది. ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు...అశ్వనీకుమార్ రాజా, సింధు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అశ్వనీకుమార్@జంషెడ్పూర్....
అశ్వనీకుమార్ రాజు... జంషెడ్పూర్లో సాధారణ మెకానిక్. 11 ఏళ్ల క్రితం భార్య పిల్లలతో విజయనగరం వలస వచ్చాడు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో భర్తతో విడిపోయిన సింధు అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితం కోసం ఈజీ మనీపై దృష్టి సారించాడు. ప్రియురాలు సింధుతో కలిసి.. అంతర్జాలంలో అశ్లీల వెబ్సైట్ను సృష్టించారు.
లోకాంటో యాప్
ఈజీ మనీ కోసం లోకాంటో యాప్ రూపొందించారు. ఆన్లైన్ వేదికగా నడిచే ఈ యాప్ ద్వారా మోసం చేయటం ప్రారంభించారు. వీరికి పరిచయం ఉన్న వారిని అందులో ఉంచి...ఆడవాళ్లు మగవాళ్లుగా.... మగవాళ్లు ఆడవాళ్లుగా మాట్లాడుతారు. ఎవరు ఎవర్ని కలుసుకునేది ఉండదు. కేవలం మాటలు...డబ్బులు వేయడం వంటి మాత్రమే జరుగుతాయి. ఇలా అమాయకులను ట్రాప్ చేసి...డబ్బులు పడగానే సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేస్తారు.
ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో....
ఈ వలపు వల వ్యవహారంలో ఓ ఎన్ఆర్ఐ చిక్కిపోయాడు. తాను మోసపోయానని నిర్ధరించుకున్న బాధితుడు...పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన పోలీసులు...ఈ ఆన్లైన్ దందాను బయటపెట్టారు.
ఇదీ చదవండి