బాలికపై అత్యాచారం బాధాకరం:చంద్రబాబు అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని అన్నారు. చట్టాలు తేవడమే కాదు..అమల్లోనూ చిత్తశుద్ధి ఉండాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, అధికారులు వచ్చి బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని నిలదీశారు. బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని...బాలిక చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి : అత్యాచార బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ