15 నెలల్లో వైకాపా అరాచకాలు మునుపెన్నడూ లేని విధంగా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. తెదేపా నాయకులతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు.
కరోనాలో అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులపై పాతకేసులు ఎత్తేస్తూ... చేయని నేరానికి తెదేపా నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దళితులు, గిరిజనులపై వైకాపా దమనకాండ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో భూములకు భద్రత... ప్రాణాలకు రక్షణ ఏదనీ నిలదీశారు. అభివృద్ధిని నాశనం చేసే పాలకులను చూడలేదన్న చంద్రబాబు... రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించి అన్ని జిల్లాలలో విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది అభివృద్ధి, ఏది విధ్వంసమనేది ప్రజలకు జగన్ వివరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది'