గుంటూరు జిల్లా ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో పరిటాల రవి 15వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... పెత్తందారీ వ్యవస్థను ఎదురించి, పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన వ్యక్తి పరిటాల రవి అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన రవి... పేదల అభిమానాన్ని పొందారని చెప్పారు. పరిటాల రవి మరణించి 15 ఏళ్లు కావొస్తున్నా... నేటికీ ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'తలకిందులుగా తపస్సు చేసినా మండలిని రద్దు చేయలేరు'