ETV Bharat / city

వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు

author img

By

Published : Dec 22, 2021, 3:06 PM IST

Chandrababu Fires On Ministers: రామతీర్థం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని ఆరోపించారు. వైకాపా అరాచకాలు ఎల్లకాలం సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు.

Chandrababu Fires On Ministers
Chandrababu Fires On Ministers

Chandrababu Fires On Ministers: అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండించారు. రామతీర్థం సాక్షిగా వైకాపా అరాచకం బట్టబయలైందన్నారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే.. దాడులు చేసే సంస్కృతికి వైకాపా ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Chandrababu Fires On Ramatheertham incident: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారన్న చంద్రబాబు.. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదు, భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు అని బాబు ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగించి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు.

ఏం జరిగిందంటే...?
Ramatheertham incident: విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చెలరేగింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ప్రభుత్వం శంకుస్థాపనం చేయడం ఏంటని ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. ధర్మకర్తల మండలితో చర్చించకుండానే ప్రభుత్వం.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తరఫున ఏర్పాటు చేసిన పునర్నిర్మాణ, శంకుస్థాపన శిలాఫలకాలను తోసేశారు. స్పందించిన అధికారులు అశోక్ గజపతిరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అధికారులు.. అశోక్​కు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి, బొత్స నారాయణ గుడికి వచ్చారు.

హిందూ ధర్మాన్ని కాపాడాలి - అశోక్ గజపతిరాజు
ashok gajapathi raju slams YCP govt: దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి... ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్‌ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.

అశోక్​ గజపతిరాజుపై మంత్రుల విమర్శలు
Ministers Comments On ashok gajapathi raju రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి చేసిన వీరంగంపై మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండపై ఏ దేవుడున్నాడో కూడా ఆయనకు తెలియదంటూ విమర్శలు గుప్పించారు. ఆలయ ధర్మకర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యాదలూ ఇచ్చినా.. రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతిరాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారమే శిలా ఫలకంపై పేర్లు రాయించామని వివరణ ఇచ్చారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన.. వచ్చే శ్రీరామ నవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. అశోక్ గజపతిరాజు లాంటి పెద్ద మనిషి ఇలా ప్రవర్తించడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ ఒక్క రోజూ లెటర్ కూడా రాయలేదని తెలిపారు. ఆలయ ధర్మకర్తగా ఆయన గుడి గురించి పట్టించుకోకపోయినప్పటికీ.. ప్రభుత్వం తరఫున ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు వెళ్తే ఆయన వీరంగం సృష్టించడం దారుణమన్నారు.

ఇదీ చదవండి:

రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.