ETV Bharat / city

పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు: చంద్రబాబు - డీజీపీకి చంద్రబాబు లేఖ న్యూస్

రాష్ట్రంలో పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికార పార్టీతో పోలీసులు కుమ్మకై.. బాధితులకు జరిగే అన్యాయం పట్ల శీతకన్ను వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు 3 పేజీల లేఖ రాసిన ఆయన.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

chandrababu
chandrababu
author img

By

Published : Oct 5, 2020, 9:22 AM IST

Updated : Oct 5, 2020, 11:27 AM IST

ప్రజల ప్రాథమిక హక్కులను, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని.. డీజీపీ గౌతం సవాంగ్‌కు రాసిన లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కోరటం.. ప్రతిపక్షనేతగా తన బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై వరుస దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, హింసాత్మక దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి.. సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని లేఖలో ధ్వజమెత్తారు.

రాజమహేంద్రవరంలో తన కుమార్తెను అధికారపార్టీ వ్యక్తి వేధిస్తున్నాడని సత్తార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే.. నిందితుడిపై కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరించారన్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేకే ఎస్పీ కార్యాలయం ఎదుటే సత్తార్‌ ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి బయట కారును దుండగులు ధ్వంసం చేశారని.. సమీపంలోనే పోలీస్‌ పికెట్‌ ఉన్నా ఈ దాడిలో అనేకమంది పాల్గొన్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టాభి మాట్లాడకుండా గొంతునొక్కాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించారు. పార్టీ నేతలపై ఈ తరహా గొలుసుకట్టు దాడులు గతంలోనూ చాలా జరిగాయన్న తెలుగుదేశం అధినేత.. బడుడు బలహీన వర్గాలు, మహిళలు, జర్నలిస్టులపైనా వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుస శిరోముండనాల ఘటనలతో పాటు దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలపై కుట్రపూరితంగా దాడులు జరుగుతున్నాయని లేఖలో వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా.. ప్రశ్నించేవారి ఆస్తులను అర్థరాత్రి కూల్చటమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలకు అడ్డుకట్ట వేసి ప్రజల హక్కులు కాపాడటం అత్యవసరమని చంద్రబాబు లేఖలో తేల్చి చెప్పారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీ పోలీసులపై అత్యధికంగా వ్యక్తిగత కేసులు నమోదయ్యాయని చంద్రబాబు విమర్శించారు. దేశవ్యాప్తంగా పోలీసులపై మొత్తం 4,068 కేసులు నమోదైతే.. అందులో 1,681 కేసులు అంటే 41శాతం ఏపీలోనే ఉండటం ఆందోళనకరమని దుయ్యబట్టారు.చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.

ఇదీ చదవండి: ట్రంప్​కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..!

Last Updated : Oct 5, 2020, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.