ETV Bharat / city

'మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముంది' - చంద్రబాబు

తెదేపా కార్యకర్తలను, నాయకులను వేధించి కష్టపెట్టిన వైకాపా నేతలు, అధికారుల పేర్లను నమోదు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు శ్రేణులకు సూచించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరినందుకు... బాపట్ల ఎంపీ సురేష్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు బాధితులు పలువురు చంద్రబాబును కలిశారు. మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు.

Chandrababu fires on Jagan Over Attacks on tdp cadre
'మంచి కోసం పోరాటం చేయడంలో తప్పేముంది'
author img

By

Published : Feb 20, 2020, 11:53 PM IST

Updated : Feb 21, 2020, 12:00 AM IST

అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా నందిగామలో 20 మంది నిరసనదీక్ష చేశామని కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, పోలీసులు తమపై కక్ష గట్టారని వారు తెలిపారు.

అమరావతి పరిరక్షణ సమితికి ప్రవాసాంధ్రులు కోనేరు ఉమా మహేశ్వరరావు, శారద దంపతులు 50 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబును కలసి రాజధాని తరలింపు నిర్ణయంపై వ్యతిరేకతను, ఆవేదనను వ్యక్తం చేశారు.

బాపట్ల నియోజకవర్గ తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జిగా నియమించినందుకు నరేంద్రవర్మ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బాపట్లలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చేందుకు అందరితో కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.

కుప్పం పర్యటనకు చంద్రబాబు...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర మలివిడత కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్వహించనున్నారు. ఈ నెల 24, 25తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటిస్తారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన తొలి పర్యటన విజయవంతం అయిందని భావిస్తున్న తెలుగుదేశం వర్గాలు... రెండో కార్యక్రమాన్ని పెద్దఎత్తున జయప్రదం చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఇదీ చదవండీ... దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి

Last Updated : Feb 21, 2020, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.