ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అనాగరిక పాలన వచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి పాలక పార్టీ సభ్యుల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా ఎందుకు మారారని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వైకాపాకి చెందిన నాయకులు వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు.
దళితుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తూ పోలీసుల సమక్షంలో చావబాది శిరోముండనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకే వరప్రసాద్ పై దాడి జరిగిందన్నారు. వరప్రసాద్‌కు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అనాగరిక చర్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
![చంద్రబాబు ట్వీట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8116291_347_8116291_1595340408339.png)
ఇదీ చదవండి : కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్