ETV Bharat / city

పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబుకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. నిన్న అచ్చెన్న పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని.... ప్రతిష్ట కలిగిన కుటుంబంపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

chandrababu comments
తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Jun 13, 2020, 4:39 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్​ నుంచి గుంటూరులోని జీజీహెచ్​కు వచ్చారు. అయితే.. పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ తనకు అనుమతి ఇవ్వలేదని... చూడాలంటే మెజిస్ట్రేట్ అనుమతి కావాలని చెప్పారని చంద్రబాబు తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు.

తప్పుడు రికార్డులు సృష్టించి అరెస్ట్ చేశారు..

chandrababu comments
తెదేపా అధినేత చంద్రబాబు

అచ్చెన్నాయుడుకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని చంద్రబాబు తెలిపారు. అలాంటి అచ్చెన్నను ఉన్న ఫళంగా ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారని... నిన్న ఆయనతో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నదన్నారు. ఇలాంటి దుర్మార్గాలు సమాజానికి మంచివి కావని ఆవేదన చెందారు. ప్రస్తుత ప్రభుత్వ అవినీతిపై శాసనసభలో నిలదీస్తారనే ఇలాంటివి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు రికార్డులు సృష్టించి అచ్చెన్నను అరెస్టు చేశారన్నారు.

ప్రలోభ పెట్టి లాక్కున్నారు...

పేరున్న కుటుంబంపై బురద చల్లేందుకే ఇలాంటి అరెస్టులని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిని అరెస్టు చేశారని... ప్రలోభాలు పెట్టి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాక్కున్నారని చంద్రబాబు ఆరోపించారు. అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయడం అధికార దుర్వినియోగం కిందే లెక్కని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

అరెస్టులకు ఆధారాలున్నాయి.. చర్చకు సిద్ధమా?: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.