ETV Bharat / city

'వెళ్లిపోయిన కంపెనీలు, పెట్టుబడులను తిరిగి తీసుకువస్తామా?'

author img

By

Published : Mar 17, 2020, 4:43 PM IST

వైకాపా తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, రిలయన్స్ కంపెనీలు ఇప్పటికే పోయేలా చేసిన ప్రభుత్వం..తాజాగా ఆసియన్ పేపర్ మిల్స్​ను కూడా ప్రకాశం జిల్లా నుంచి తరిమేసేందుకు ప్రయత్నం చేస్తోందని ట్వీట్ చేశారు.

chandrababu comments on ycp govt over investments in ap

వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ నుంచి అదానీ, తిరుపతి నుంచి రిలయన్స్, అమరావతిలో సింగపూర్ కన్సార్టియంను పోయేలా చేసిన ప్రభుత్వం...తాజాగా ప్రకాశం జిల్లా వంతు వచ్చిందని అన్నారు. రూ.24 వేల కోట్ల పెట్టుబడి, 4వేలు ప్రత్యక్ష, 12వేలు పరోక్ష ఉద్యోగాలను ఇచ్చే ఆసియన్ పేపర్ మిల్స్​ను ప్రకాశం జిల్లా నుంచి తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు వాయిదా పడితే...ఎంపీలతో ఒత్తిడితో లేదా కేంద్రానికి లేఖలు రాసో రాష్ట్రానికి రావాల్సిన రూ.4 వేల కోట్లు అడిగి తెచ్చుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ వైకాపా బెదిరింపులకు భయపడి పారిపోయిన కంపెనీలను, పెట్టుబడులను, ఉద్యోగాలను మళ్ళీ ఏ విధంగా తీసుకువస్తామని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది, భావితరాల భవిష్యత్​ తలుచుకుంటే బాధేస్తోందన్నారు.

చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి :

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎస్​కు ఎస్​ఈసీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.