ETV Bharat / city

మిల్కా సింగ్​కు చంద్రబాబు, నారా లోకేశ్​ సంతాపం

భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. మిల్కా సింగ్ పరుగు పోటీల్లో భారత్​ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.

author img

By

Published : Jun 19, 2021, 2:16 PM IST

Chandrababu and Nara Lokesh  condolence to Milkha Singh death
మిల్కా సింగ్​కు చంద్రబాబు, నారా లోకేశ్​ సంతాపం..

భారత లెజండరీ స్ప్రింటర్​ మిల్కా సింగ్ (91) కన్నుమూత పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పరుగుల్లో చిరుతను తలపించే మిల్కాసింగ్ మృతి అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరుగు పోటీల్లో భారత్​ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. గొప్ప అథ్లెట్​ను దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

మిల్కా సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మిల్కా సింగ్ ఆత్మకు శాంతి కలగాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. దేశం ఓ గొప్ప క్రీడాకారుడ్ని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మిల్కా సింగ్ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని లోకేశ్​ అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి:

మిల్కాకు ప్రధాని, రాష్ట్రపతి నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.