ETV Bharat / city

'వైకాపాను మళ్లీ గెలిపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

author img

By

Published : Jan 14, 2020, 7:06 AM IST

Updated : Jan 14, 2020, 7:49 AM IST

మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలు వెళ్లాలని తెదేపా నేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు. విజయవాడ బెంజ్​సర్కిల్​లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

chandra fire gn rao commity report in bhogi fire
జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేస్తున్న చంద్రబాబు

'వైకాపాను మళ్లీ గెలిపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందన్నారు. వేల సంవత్సరాల క్రితమే రాజ్యంగా ఉన్న.. అమరావతి చారిత్రక ప్రాధాన్యత కాపాడుకోవాలని సూచించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారుయ జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

ఇదీ చదవండి

ఇచ్చిపుచ్చుకుందాం...తెలుగు రాష్ట్రాల సీఎంల నిర్ణయం

Last Updated : Jan 14, 2020, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.