ETV Bharat / city

'వైకాపా హామీలను తుంగలో తొక్కింది..ఒప్పందాల ఉల్లంఘన సరికాదు'

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర విరివిగా నిధులు కేటాయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆమె విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను ఉల్లంఘించడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు.

nirmala seetharaman
'వైకాపా హామీలను తుంగలో తొక్కింది..ఒప్పందాల ఉల్లంఘన సరికాదు'
author img

By

Published : Jun 26, 2020, 5:30 PM IST

Updated : Jun 27, 2020, 2:30 AM IST

ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ఆంధ్రప్రదేశ్ లాంటి బలమైన రాష్ట్రం ఇప్పుడు కరప్షన్, కుటుంబం, కులం లాంటి రాజకీయ సమస్యల్లో చిక్కుకుని పురోగతి కరవై కష్టాలు పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన వైకాపా ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ విమర్శించారు. రాష్ట్ర భాజపా నాయకత్వంలో జరిగిన మూడో వర్చువల్ బహిరంగ సభ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల జాతీయ స్థాయిలో సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని అన్నారు.

కేంద్రం కేవలం 2 రూపాయల 70 పైసల చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తున్నా... రాష్ట్రంలో 9 రూపాయలు వసూలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని నిర్మలా సీతారామన్​ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు మంచి స్థానంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని తెలిపారు. మత్స్య సంపద యోజన కింద రాష్ట్రానికి రూ.11,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కరోనాపై పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8,025 కోట్లు ఇచ్చామన్నారు.

వైకాపా హామీలను తుంగలో తొక్కింది..ఒప్పందాల ఉల్లంఘన సరికాదు :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

సంస్కరణలు తీసుకొచ్చాం

తాము చేసిన అభివృద్ధి వల్లే రెండోసారి మరింత మెజార్టీతో గెలిచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలకు ఏం కావాలో...ఏం చేయాలో భాజపాకు తెలుసని అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..!

  • దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల ద్వారా రూ.30 వేల కోట్ల రుణం కేటాయించాం. బడ్జెట్​ ద్వారా మరో రూ.90 వేల కోట్లు మంజూరు చేశాం.
  • కరోనాతో దెబ్బతిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాన్ని ఆదుకునేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ స్కీం కింద రూ.2,157 కోట్లు మంజూరు చేశాం.
  • జన్​థన్​ ఖాతాల ద్వారా.. రూ.500 చొప్పున మూడు నెలలకు మహిళలకు ఒక్కొక్కరికి రూ.1500 వరకు ఇచ్చాం.
  • బిల్డింగ్ కాంట్రాక్టు వర్కర్ల కోసం కన్​స్ట్రక్షన్ ఫండ్ నుంచి 19.60 లక్షల మందికి కేంద్రం నిధులు కేటాయించింది.
  • రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులను ఆదుకుంటున్నాం.
  • కరోనా విపత్కర సమయంలో ప్రత్యేక శ్రామిక్​ రైళ్ల ద్వారా వలస కూలీలను తరలించాం.
  • ఎన్నో ఏళ్లుగా వివాదంగా ఉన్న 370 ఆర్టికల్​ను రద్దు చేసి జమ్ముకశ్మీర్​లో అభివృద్ధి పనులు వేగవంతం చేశాం.

పౌరహక్కుల చట్టంలో సవరణలు తెచ్చామని నిర్మలా సీతారామన్​ గుర్తు చేశారు. సభ ప్రారంభం ముందు గల్వాన్ లోయలో అమరులైన సైనికుల ఆత్మశాంతికి కొద్దిసేపు పార్టీ నేతలు మౌనం పాటించారు.

ఇదీ చదవండి:

కేంద్ర ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ

Last Updated : Jun 27, 2020, 2:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.