తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ కొట్టేసింది. ఆయన సస్పెన్షన్ రద్దు చేసేందుకు నిరాకరించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో సర్వీసు నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగంపై ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. తనను అన్యాయంగా విధుల నుంచి తప్పించారని ఆరోపించారు.
అయితే నిబంధనలను అనుసరించే ఆయన్ను సస్పెండ్ చేశామని.. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదించిందని రాష్ట్ర సర్కారు వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌లతో కూడిన ధర్మాసనం... ఏబీ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.
ఇదీ చూడండి: