ETV Bharat / city

jagan cases: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

jagan cases: హైదరాబాద్​ సీబీఐ కోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై విజయసాయి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరుకాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది.

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

author img

By

Published : Dec 23, 2021, 8:38 PM IST

Updated : Dec 23, 2021, 10:01 PM IST

jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దిల్లీలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరు కాలేక పోయారని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి కదా అని న్యాయస్థానం అడగ్గా.. సాయంత్రం వరకు జరిగినందున ఇవాళ రాలేక పోయారని న్యాయవాది వివరించారు. దీంతో విజయసాయిరెడ్డికి నేటి విచారణకు హాజరు మినహాయింపునిచ్చింది.

జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై ఇవాళ విజయసాయిరెడ్డి వాదనలు జరిగాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై హైకోర్టులో స్టేటస్ కో ఉన్నందున.. ప్రస్తుత దశలో విచారణ జరపడం తగదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ కేసు కూడా ఇంకా రుజువు కాలేదన్నారు. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

ఇందూ టెక్ జోన్ లో డిశ్చార్జ్ పిటిషన్ పై జగన్ వాదనలు జరిగాయి. ఇందూ టెక్ జోన్ కు భూమి కేటాయింపు ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు ఈనెల 31కి వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి:

దేశంలో కొవిడ్​ పరిస్థితులపై మోదీ సమీక్ష

Last Updated : Dec 23, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.