ETV Bharat / city

karvy MD arrest: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు - కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తాజా వార్తలు

కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో పార్థసారథిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకుని.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని సదరు బ్యాంకు ప్రతినిధులు రెండు నెలల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

karvy MD arrest
karvy MD arrest
author img

By

Published : Aug 19, 2021, 5:15 PM IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు

కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో పార్థసారథిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ. 137 కోట్లు రుణం తీసుకున్న పార్థసారథి.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో సదరు బ్యాంకు ప్రతినిధులు రెండు నెలల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పార్థసారథిని అరెస్టు చేశారు.

కార్వీ సంస్థ తన పెట్టుబడిదారుల షేర్లను సొంత ఖాతాకు బదిలీ చేసుకుని సొంత షేర్లుగా చెప్పుకుని బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో లోన్లు తీసుకుంది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల షేర్లను వినియోగించుకుంది. నిజమేనని నమ్మిన బ్యాంకులు దాదాపు రూ. 137 కోట్ల రుణాలు ఇచ్చాయి. అప్పు తీర్చకపోవడంతో ఆయా బ్యాంకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశాం -అవినాశ్‌ మహంతి, జాయింట్‌ సీపీ

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.. ఇండస్ ఇండ్ బ్యాంకుతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల్లో రుణం తీసుకుంది. ఆ తర్వాత రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు సైతం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాయి. పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి రూ. కోట్లలో రుణం తీసుకున్నారు. ఇన్వెస్టర్లకు తెలియకుండా సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. మిగతా బ్యాంకులు ఇచ్చిన రుణం కేసుల్లోనూ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పార్కు చేసిన కారులో మృతదేహం.. పోలీసుల ముమ్మర దర్యాప్తు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.