ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు మార్చాలని అంటున్నారని ముఖ్యమంత్రి జగన్ను అమరావతి రైతులు ప్రశ్నించారు. రాజధానిపై ఏర్పడిన జీఎన్ రావు నిపుణుల కమిటీని ఆ ప్రాంత రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వసతుల నిలయంగా ఉన్న ప్రాంతం నుంచి రాజధానిని మార్చవద్దని వారు కమిటీని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లను తమకు తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కమిటీకి విజ్ఞాపనలిచ్చేందుకు గడువు కూడా నిన్నటితో ముగిసింది.
"అమరావతినే రాజధానిగా కొనసాగించాలి" - amaravati formers demand to continue amaravathi as capital city
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు మార్చాలని అంటున్నారని ముఖ్యమంత్రి జగన్ను అమరావతి రైతులు ప్రశ్నించారు. రాజధానిపై ఏర్పడిన జీఎన్ రావు నిపుణుల కమిటీని ఆ ప్రాంత రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వసతుల నిలయంగా ఉన్న ప్రాంతం నుంచి రాజధానిని మార్చవద్దని వారు కమిటీని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లను తమకు తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కమిటీకి విజ్ఞాపనలిచ్చేందుకు గడువు కూడా నిన్నటితో ముగిసింది.
capital
Conclusion: