లక్ష పదిహేడు వేల మంది సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకుండా... రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయటం సరికాదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించి ఇంత వరకు ఫలితాలు ప్రకటించలేదన్నారు. డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాలేదని ప్రొబేషన్ పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. మరికొన్ని శాఖల ఉద్యోగులకు పరీక్షలే పెట్టలేదన్నారు.
జూన్ 30 నాటికి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేస్తానని ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకోవాలని బొప్పారాజు కోరారు. ప్రొబేషన్ పూర్తి చేసిన వెంటనే సచివాలయం ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా బయోమెట్రిక్ విధానం ఉందొ.. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు కేటాయించాలన్నారు. ఇప్పుడు ఉన్న బయోమెట్రిక్‌తో సచివాలయ ఉద్యోగులు తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతున్నారన్నారు.అలాగే ప్రభుత్వం పాత పింఛన్ విధానాన్ని ప్రకటించాలన్నారు. తమ ఆశలు ఆడియాసలు కాకుండా సీఎం జగన్ చూడాలని కోరారు. జూన్ 30 లోపు తమ డిమాండ్లను నేరవేర్చకపోతే తాము మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి: