రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ బిశ్వభూషణ్‌కు భాజపా ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. పీడీ ఖాతాల ద్వారా ప్రజానిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రజాధనం వినియోగంలో నిబంధనలు, పారదర్శకత పాటించాలని అన్నారు. పీడీ ఖాతాలను అత్యవసర పరిస్థితుల్లోనే వినియోగించాలని అంతేకానీ నిధులు దారి మరల్చేందుకు, నిబంధనల నుంచి తప్పించుకునేందుకు వాడకూడదని తెలిపారు. కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని లేఖలో కోరారు. దీంతో పాటు సీబీఐ విచారణకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో గవర్నర్‌కు విన్నపించారు.
ఇదీ చదవండి:
CM Jagan: 'పల్లెలు శుభ్రంగా ఉంటేనే..ప్రజలకు ఆరోగ్యం'
Water War: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల