రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులకు నిరసనగా పలు జిల్లాల్లో.. భాజపా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
గుంటూరులో
![bjp followers protest opposing attacks on temples in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10102122_gnt.jpg)
ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. గుంటూరు జిల్లాలో భాజపా మహిళా మోర్చా సభ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి విమర్శించారు. దేవాలయాలకు రక్షణ కల్పించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్రైస్తవ రాజ్యం కొనసాగించే దిశగా.. వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. భాజపా జిల్లా అధ్యక్షడు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రామతీర్థంలో ఘటన మరువక ముందే కర్నూలులో మరో ఘటన జరగడం బాధాకరమన్నారు. హిందూ దేవాలయాలపైన దాడులు చూస్తుంటే.. రాష్ట్రంలో క్రైస్తవ పాలనా సాగుతున్నట్లు అనిపిస్తోందన్నారు.
నెల్లూరులో
![bjp followers protest opposing attacks on temples in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10102122_nlr.jpg)
దేవాలయాలు, భగవంతుని విగ్రహాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. నెల్లూరులో విశ్వహిందూ పరిషత్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఏమిపట్టనట్లు వ్యవహరించడం దారుణమని వారు మండిపడ్డారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించకుంటే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
అనంతపురంలో
![bjp followers protest opposing attacks on temples in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10102122_atp.jpg)
రామతీర్థంలో జరిగిన ఘటనను ఖండిస్తూ.. అనంతపురంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆందోళన చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండా వైకాపా ప్రభుత్వం అసమర్థత పాలన సాగిస్తోందని విమర్శించారు.
విజయనగరంలో
![bjp followers protest opposing attacks on temples in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10102122_vzm.jpg)
హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ.. విజయనగరం జిల్లా పార్వతీపురంలో భాజపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేవాలయాలకు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: